GAP Line

Main Banner

Saturday, September 28, 2019

నూతన బస్సును ప్రారంభించిన పద్మాదేవేందర్‌రెడ్డి గారుమెదక్ బస్సు డిపోకు మరిన్ని కొత్త బస్సులను తీసుకొస్తానని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ నుంచి జేబీఎస్ వరకు నాన్‌స్టాప్ బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మెదక్ డిపోకు ఎక్స్‌ప్రెస్, డిలక్స్ బస్సులతో పాటు పల్లెవెలుగు బస్సులు కావాలని రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. కొత్త బస్సులు రాగానే ప్రయాణికుల అవసరాల దృష్ట్యా మెదక్ నుంచి హైదరాబాద్‌కు తదితర ప్రాంతాలకు బస్సుల సంఖ్యను పెంచడం జరుగుతుందన్నారు. అంతేగాకుండా ఏ రూట్లలో బస్సులు అవసరమో గుర్తించి ఆయా రూట్లలో బస్సులు నడుపడం జరుగుతుందన్నారు. మెదక్ నుంచి చేగుంట వరకు డబుల్ రోడ్డు అందుబాటులోకి రావడంతో తూప్రాన్ జాతీయ రహదారికి సులభంగా చేరుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్యరెడ్డి, మెదక్ ఎంపీపీ యమున, డిపో మేనేజర్ జాకీర్ హుస్సేన్, టీఎంయూ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, మొగులయ్య, బోస్, శాఖయ్య, ఆంజనేయులు, అశ్వక్ అహ్మద్, మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, మాజీ కౌన్సిలర్లు మల్లేశం, గౌష్‌ఖురేషి, శ్రీనివాస్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు గంగాధర్, టీఆర్‌ఎస్ నాయకులు శివరామకృష్ణ, శంకర్, జయరాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అంజాగౌడ్, శ్రీకాంత్, ఉమర్ తదితరులు పాల్గొన్నారు.