skip to main |
skip to sidebar
పండుగలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
దసరా, బతుకమ్మ పండుగ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈనెల 28 నుంచి అక్టోబర్ 11వ తేదీవరకు ప్రయాణికుల సౌకర్యార్థం మెదక్ రీజియన్ పరిధిలోని ఏడు డిపోల నుంచి 278 ప్రత్యేక సర్వీసులను ఆర్టీసీ నడపనుంది. వీటితోపాటు మరో 24 బస్సు సర్వీసులను ఆంధ్ర దూర ప్రాంతాలైన వైజాగ్, బెంగుళూరు, కందుకూరు, కనిగిరి ప్రాంతాలకు నడపనున్నారు. మెదక్ రీజియన్‌లోని అన్ని డిపోల నుంచి హైదరాబాద్ జేబీఎస్‌కు ఎక్కువ బస్సులు నడపనున్నారు. తెలంగాణలోని ఆయా ప్రాంతాలకు శనివారం నుంచి, ఆంధ్ర, ఇతర దూర ప్రాంతాలకు అక్టోబర్ 4 నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల బస్సు ఛార్జీలను 30 శాతం అదనంగా వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా బస్సుల్లోనే సురక్షిత ప్రయాణం చేయాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.