GAP Line

Main Banner

News Image
News Image
News Image
News Image
News Image
Showing posts with label RTC News. Show all posts
Showing posts with label RTC News. Show all posts

Friday, October 18, 2019

తాత్కాలిక కండక్టర్ పై డ్రైవర్ అఘాయిత్యం



మహిళా కండక్టర్ పై తాత్కాలిక డ్రైవర్ అత్యాచారయత్నం, ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె విషయంలో వెనక్కి తగ్గేందుకు ఏ మాత్రం ఇష్టపడని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకోసం చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూసేందుకు వీలుగా తాత్కాలిక సిబ్బందితో ఆర్టీసీ బస్సుల్ని నడుపుతున్నారు. అరకొర అనుభవం ఉన్న సిబ్బంది కారణంగా ఇప్పటికే పలు ప్రమాదాలు చోటు చేసుకోగా..తాజాగా ఒక దారుణం బయటకు వచ్చింది. మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్సులో పని చేసే తాత్కాలిక మహిళా కండక్టర్ పైన తాత్కాలిక డ్రైవర్ అత్యాచారయత్నం చేయటం సంచలనంగా మారింది. ప్రయాణికుల్ని ఎక్కించుకోకుండా పథకం ప్రకారం కండక్టర్ మీద అత్యాచారం చేయటం కోసం పథకం పన్నాడు. లైంగిక దాడికి ప్రయత్నించాడు. లక్కీగా..సదరు మహిళా కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి తాత్కాలిక డ్రైవర్ బారి నుంచి తప్పించుకుంది. గురువారం రాత్రి జరిగిన ఈ ఉదంతం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో ఇప్పటివరకూ మహిళా కండక్టర్ పట్ల సిబ్బంది ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించింది లేదు. తాత్కాలిక సిబ్బందితో విధులు నిర్వర్తించటం అగ్గితో ఆడుకోవటమే కాదు..ప్రయాణికులకు సైతం సేఫ్ కాదన్న వైనం తాజా ఉదంతంతో స్పష్టమైందని చెప్పక తప్పదు.


రేపటి బంద్ ని విజయవంతం చేద్దాం..



గత 14 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు, ఆయా వర్గాల నుండి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. పట్టణ ప్రాంతాల కాక, గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు, ఆయా పార్టీలతో పాటు పలు సంస్థలు మద్దతు ప్రకటిస్తున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు మద్దతుగా, బిజెపి, సిపిఐ పార్టీలతో పాటు, పలు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. నర్సాపూర్ బస్టాండ్ లో సిపిఐ, బిజెపి కార్యకర్తలు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. అనంతరం నర్సాపూర్ ప్రధాన రహదారుల వింటా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికులకు ఇలాంటి హాని తలపెట్టిన ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. త్వరగా కార్మికులతో చర్చించి, సమ్మె పరిష్కరించాలని, లేకుంటే ప్రభుత్వానికి కష్టాలు తప్పవని ఈ సందర్భంగా బీజేపీ సీపీఐ నాయకులు హెచ్చరించారు. 14 రోజులుగా కార్మికుల సమ్మె నిర్వహిస్తున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, నియంతలా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా నాయకులు అన్నారు. ఆర్టీసీ కార్మికులకు తమ సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.

Monday, October 14, 2019

ఆర్టీసీ కార్మికుడి మృతికి నిరసనగా కొవ్వొత్తులతో ర్యాలీ


ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరికి మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్‌ దేవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఖమ్మం డిపో డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి శనివారం ఖమ్మంలోని తన ఇంటి వద్ద కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన ఆయనను వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు తరలించారు. కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీవో ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఉదయం మృతి చెందారు. శ్రీనివాస్ రెడ్డి ఆత్మకు శాంతి చేకురాలని కోరుతూ ఆదివారం పట్టణంలోని ప్రయాణ ప్రాంగణం నుండి అంబేడ్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు రాజు గౌడ్, శ్యాంసుందర్ గౌడ్ తో పాటు, కాంగ్రెస్ జిల్లా అదికారి ప్రతినిధి, ఆంజనేయులు గౌడ్, బిజెపి నాయకులు పాపగారి రమేష్ గౌడ్, బుచ్చేష్ యాదవ్, సురేష్ నాయక్, ప్రేమ్ కుమార్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.


















Wednesday, October 9, 2019

గురువారం నుంచి షెడ్యూల్‌ ప్రకారం బస్సులు



ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ముందు ప్రతి డిపోలో ఎలాంటి టూర్‌ షెడ్యూల్‌ ఉండేదో అదే షెడ్యూల్‌ను దాదాపు గురువారం నుంచి అమలు చేయనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. నాలుగు రోజులుగా ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులతో పాటు వివిధ వాహనాలను తిప్పి, ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చిచామని, అదే మాదిరిగా తిరుగు ప్రయాణానికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. అధిక చార్జీలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై  పోలీస్‌ శాఖ నుంచి డీఎస్పీ స్థాయి అధికారిని ఇంఛార్జ్‌గా నియమిస్తున్నామని మంత్రి తెలిపారు. బస్సుల్లో డ్రైవర్‌ సీటు వెనకాల ధరల పట్టిక కింద ఆయా కంట్రోల్‌ రూంల నెంబర్లు ఉన్నాయని, టికెట్‌ ధర కంటే ఎక్కువ ఛార్జీ తీసుకుంటే ఆ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని మంత్రి తెలిపారు. ఈ నెల 14 నుంచి విద్యా సంస్థలు కూడా ప్రారంభం కానుండటంతో షెడ్యూల్‌ ప్రకారం బస్సులను నడుపుతామని అన్నారు. అన్ని ఆర్టీసీ బస్సుల్లోనూ బస్‌పాస్‌లను యదావిధిగా అనుమతించాలని ఆదేశాలిచ్చామన్నారు. విద్యార్థులు, వికలాంగులు, జర్నలిస్టు, ఉద్యోగులు ఇలా అన్నిరకాల బస్‌పాసులన్నీ అనుమతించాలని, బస్‌పాస్‌లు అనుమతించడం లేదనే ఫిర్యాదు రావద్దని మంత్రి  అధికారులకు తెలిపారు. బుధవారం ఆర్టీసీ బస్సులు 3116, ఆర్టీసీ అద్దె బస్సులు 1933తో పాటు ప్రైవేట్‌ వాహనాలు తిరిగాయని పువ్వాడ అజయ్ అన్నారు. ఈ రెండు రోజులు ప్రయాణీకుల రద్దీని బట్టీ మరిన్ని వాహనాలను పెంచుతామన్నారు.  రైల్వే అధికారులు కూడా ప్రత్యేకంగా మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్ల రాకపోకలను పెంచారని, అన్ని శాఖల సహకారంతో సమ్మె ప్రభావం లేకుండా చర్యలు తీసుకున్నామని అజయ్ కుమార్ అన్నారు.

Saturday, September 28, 2019

పండుగలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు



దసరా, బతుకమ్మ పండుగ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈనెల 28 నుంచి అక్టోబర్ 11వ తేదీవరకు ప్రయాణికుల సౌకర్యార్థం మెదక్ రీజియన్ పరిధిలోని ఏడు డిపోల నుంచి 278 ప్రత్యేక సర్వీసులను ఆర్టీసీ నడపనుంది. వీటితోపాటు మరో 24 బస్సు సర్వీసులను ఆంధ్ర దూర ప్రాంతాలైన వైజాగ్, బెంగుళూరు, కందుకూరు, కనిగిరి ప్రాంతాలకు నడపనున్నారు. మెదక్ రీజియన్‌లోని అన్ని డిపోల నుంచి హైదరాబాద్ జేబీఎస్‌కు ఎక్కువ బస్సులు నడపనున్నారు. తెలంగాణలోని ఆయా ప్రాంతాలకు శనివారం నుంచి, ఆంధ్ర, ఇతర దూర ప్రాంతాలకు అక్టోబర్ 4 నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల బస్సు ఛార్జీలను 30 శాతం అదనంగా వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా బస్సుల్లోనే సురక్షిత ప్రయాణం చేయాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.