GAP Line

Main Banner

Friday, October 18, 2019

రేపటి బంద్ ని విజయవంతం చేద్దాం..



గత 14 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు, ఆయా వర్గాల నుండి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. పట్టణ ప్రాంతాల కాక, గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు, ఆయా పార్టీలతో పాటు పలు సంస్థలు మద్దతు ప్రకటిస్తున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు మద్దతుగా, బిజెపి, సిపిఐ పార్టీలతో పాటు, పలు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. నర్సాపూర్ బస్టాండ్ లో సిపిఐ, బిజెపి కార్యకర్తలు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. అనంతరం నర్సాపూర్ ప్రధాన రహదారుల వింటా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికులకు ఇలాంటి హాని తలపెట్టిన ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. త్వరగా కార్మికులతో చర్చించి, సమ్మె పరిష్కరించాలని, లేకుంటే ప్రభుత్వానికి కష్టాలు తప్పవని ఈ సందర్భంగా బీజేపీ సీపీఐ నాయకులు హెచ్చరించారు. 14 రోజులుగా కార్మికుల సమ్మె నిర్వహిస్తున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, నియంతలా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా నాయకులు అన్నారు. ఆర్టీసీ కార్మికులకు తమ సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.