GAP Line

Main Banner

Friday, October 18, 2019

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా CPI - CPM పార్టీల సామూహిక నిరాహార దీక్ష



న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆర్టీసీ కార్మిక ఐకాస నాయకులు అన్నారు. సమస్యల పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన సమ్మె గురువారంతో 13వ రోజుకు చేరింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మెదక్‌ డిపో పరిధిలో మెుత్తం 104 బస్సులుండగా.. ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్ల సాయంతో 85 బస్సులు రాకపోకలు సాగించాయి. మెదక్‌ జిల్లా ఇన్‌ఛార్జి అదనపు డీసీపీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు డిపో, బస్టాండ్‌ వద్ద భద్రత కల్పిస్తున్నారు. రోజుకో తీరున సమ్మెలో భాగంగా మెదక్‌ గుల్షన్‌ క్లబ్‌ వద్ద ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో కార్మికులు ధూంధాం కార్యక్రమం నిర్వహించారు. కళాకారులు ఆడిపాడారు. అంతకు ముందు కార్మికులు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రధాన తపాలా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. డిపో వద్ద రాస్తారోకో నిర్వహించారు. దీంతో రాకపోకలు నిలిచాయి. వివిధ సంఘాలు, పార్టీల నాయకులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి రాధాకిషన్‌, ఐకాస నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, బోస్‌, మెుగులయ్య, శాకయ్య, శ్రీనివాస్‌, ఉపాధ్యాయ నాయకులు కాముని రమేశ్‌, సంగయ్య, దత్తాత్రేయ కులకర్ణి, పద్మారావు, కాంగ్రెస్‌ నాయకులు ఆంజనేయులుగౌడ్‌, మామిళ్ల ఆంజనేయులు, సీపీఎం, సీపీఐ నాయకులు మల్లేశం, ఖలేక్‌, ఏబీవీపీ నాయకులు పృథ్వీరాజ్‌ తదితరులు మద్దతు తెలిపారు.