GAP Line

Main Banner

Friday, October 18, 2019

ప్యారడైజ్‌ హోటల్‌కు రూ.లక్ష జరిమానా



చికెన్ బిర్యానీ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు ప్యారడైజ్..! హైదరాబాద్ మాత్రమే కాదు.. దేశంలోనే ఈ రెస్టారెంట్ చాలా ఫేమస్..! సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్‌ హోటల్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు జరిమానా విధించారు. బిర్యానీలో తల వెంట్రుకలు వచ్చాయంటూ ఓ వ్యక్తి హోటల్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ప్యారడైజ్‌ హోటల్‌ పీఆర్వో రాఘవ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆ వ్యక్తి జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీలు నిర్వహించారు. కిచెన్‌‌లో అపరిశుభ్రత, వంట సామాగ్రిలో నాణ్యాత లేకపోవడం వంటి కారణాలతో హోటల్‌లో పరిశుభ్రత పాటించకపోవడాన్ని గుర్తించి రూ.లక్ష జరిమానా విధించి నోటీసు ఇచ్చారు. వారంలో పరిశుభ్రత విషయంలో లోపాలు సరిచేసుకోవాలని.. లేని పక్షంలో హోటల్‌ను సీజ్‌ చేస్తామని అధికారులు హెచ్చరించారు.