GAP Line

Main Banner

Showing posts with label Govt News. Show all posts
Showing posts with label Govt News. Show all posts

Friday, October 18, 2019

ప్యారడైజ్‌ హోటల్‌కు రూ.లక్ష జరిమానా



చికెన్ బిర్యానీ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు ప్యారడైజ్..! హైదరాబాద్ మాత్రమే కాదు.. దేశంలోనే ఈ రెస్టారెంట్ చాలా ఫేమస్..! సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్‌ హోటల్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు జరిమానా విధించారు. బిర్యానీలో తల వెంట్రుకలు వచ్చాయంటూ ఓ వ్యక్తి హోటల్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ప్యారడైజ్‌ హోటల్‌ పీఆర్వో రాఘవ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆ వ్యక్తి జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీలు నిర్వహించారు. కిచెన్‌‌లో అపరిశుభ్రత, వంట సామాగ్రిలో నాణ్యాత లేకపోవడం వంటి కారణాలతో హోటల్‌లో పరిశుభ్రత పాటించకపోవడాన్ని గుర్తించి రూ.లక్ష జరిమానా విధించి నోటీసు ఇచ్చారు. వారంలో పరిశుభ్రత విషయంలో లోపాలు సరిచేసుకోవాలని.. లేని పక్షంలో హోటల్‌ను సీజ్‌ చేస్తామని అధికారులు హెచ్చరించారు.

Wednesday, October 16, 2019

నీటి సమస్యను పరిష్కరించండి



నీటి సమస్యను తీర్చాలని పట్టణంలోని శివాలయం వీధికి చెందిన పలువురు నాయకులు పురపాలక సంఘం ఈఓ శ్రీదేవిని కోరారు. ప్రధానంగా (శివాలయం) ఆలయం వద్ద నీటి సదుపాయం లేక వచ్చే భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఈఓ శ్రీదేవిని వివరించారు. గతంలో పలుమార్లు నీటి సమస్య  పరిష్కారంపై అధికారుల దృష్టికి తెచ్చిన నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ ఎంపీటీసీ సభ్యులు సంగసాని సురేష్ ఆరోపించారు. నీటి సమస్యను పరిష్కరించాలని, ట్యాంకర్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈఓను వినతిపత్రం అందజేశారు. ఈ సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఈఓ శ్రీదేవి చెప్పారు. ఈ కార్యక్రమంలో కంది ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ సభ్యులు సంగసాని సురేష్,  రమేష్, ప్రేమ్ కుమార్, వినోద్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Wednesday, October 2, 2019

మెదక్ జిల్లా అధికారుల ఫోన్ నంబర్లు






ఓటరు వివరాలు కోసం హెల్ప్ లైన్



ఓటర్లు ఓటుకు సంబంధించిన వివరాలను స్వయంగా తెలుసుకుటనేందుకే నేషనల్ ఓటరు సర్వీస్ పోర్టల్ హెల్ప్ లైన్ యాప్‌ను ప్రవేశపెట్టారని నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి గారు అన్నారు. మంగళవారం ఆమె తన కార్యాలయంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి ఓటరుకు సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రవేశపెట్టిన యాప్‌తో ఆండ్రాయిడ్ మొబైల్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఓటరు ఐడీ కార్డు పైన ఉన్న ఏపిక్ నంబర్‌ను ఎంటర్ చేస్తే మొత్తం వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.దీని ద్వారా ఓటర్‌లో ఉన్న పేర్లు కరెక్టుగా ఉన్నాయే లేదో తెలుసుకోవచ్చని అన్నారు. ఇందులో ఓటర్ల ఇంటి పేర్లు, చిరునామా, వయస్సు, పుట్టిన తేదీ, ఫొటో వంటివి సరిగ్గా చూసుకోవచ్చని తెలిపారు. అలాగే ఓటరు పోలింగ్ కేంద్రాల వివరాలు కూడా ఈ యాప్‌లో తెలుసుకునే వీలుందని అన్నారు. ఇక నుంచి ఇంటి నుంచి నేరుగా ఈ యాప్‌ద్వారా 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉన్నదని తెలిపారు.