skip to main |
skip to sidebar
ఓటరు వివరాలు కోసం హెల్ప్ లైన్
ఓటర్లు ఓటుకు సంబంధించిన వివరాలను స్వయంగా తెలుసుకుటనేందుకే నేషనల్ ఓటరు సర్వీస్ పోర్టల్ హెల్ప్ లైన్ యాప్‌ను ప్రవేశపెట్టారని నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి గారు అన్నారు. మంగళవారం ఆమె తన కార్యాలయంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి ఓటరుకు సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రవేశపెట్టిన యాప్‌తో ఆండ్రాయిడ్ మొబైల్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఓటరు ఐడీ కార్డు పైన ఉన్న ఏపిక్ నంబర్‌ను ఎంటర్ చేస్తే మొత్తం వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.దీని ద్వారా ఓటర్‌లో ఉన్న పేర్లు కరెక్టుగా ఉన్నాయే లేదో తెలుసుకోవచ్చని అన్నారు. ఇందులో ఓటర్ల ఇంటి పేర్లు, చిరునామా, వయస్సు, పుట్టిన తేదీ, ఫొటో వంటివి సరిగ్గా చూసుకోవచ్చని తెలిపారు. అలాగే ఓటరు పోలింగ్ కేంద్రాల వివరాలు కూడా ఈ యాప్‌లో తెలుసుకునే వీలుందని అన్నారు. ఇక నుంచి ఇంటి నుంచి నేరుగా ఈ యాప్‌ద్వారా 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉన్నదని తెలిపారు.