skip to main |
skip to sidebar
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పొల్దస్ యాదగిరి (35) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తన స్వంత ఇంటికి కరెంటు సరఫరా చేసే విద్యుత్ మీటర్ వైరును సరి చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ కు గురై అక్కడిక్కడే మరణించినట్లు ఎస్ ఐ రమేష్ తెలిపారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న ఎంపీపీ కల్లూరి హరికృష్ణ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, తన సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకునేల కృషి చేస్తానన్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించి, మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు. మృతుడికి భార్య మంజుల, కుమారుడు హన్మంత్, కూతురు మానస ఉన్నారు.