GAP Line

Main Banner

Tuesday, October 1, 2019

ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అతడే ఒక రక్తదాత



ప్రాణాపాయ స్థితిలో రక్తం కావాల్సినప్పుడు రక్తం ఇవ్వాలంటే బంధువులు గాని స్నేహితులు గాని ముందుకు రాని పరిస్థితులు ఈ రోజుల్లో రక్తం కావాలని.. ఫోన్ చేస్తే అర్ధరాత్రి సైతం లేచి వచ్చి రక్తం ఇస్తాడు అతడే రక్తదాత పేరు జయ్ ముర్రే 50 సంవత్సరాలు స్థానిక చర్చి కాంపౌండ్ లో నివాసం ఉంటూ పేద ప్రజలకు సేవ చేయడం కోసం ఒక గ్రోస్ మెదక్ ఆర్గనైజేషన్ మొదలు పెట్టి స్వచ్ఛందంగా సేవ చేస్తున్నాడు. పేద ప్రజలకు బట్టలు బియ్యము పండుగ సందర్భంలో బట్టలు ఇస్తాడు. 1984లో మొట్టమొదటిసారిగా రక్తం ఇవ్వడం ప్రారంభమై నేటికి 64 రక్తం ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. ముఖ్యంగా గర్భవతి ఉన్న మహిళలకు అత్యవసర రక్తం కావాలంటే ఫోన్ చేస్తారు ఒకే రోజు రెండు ఇవ్వడం జరిగిందని.. నెలకు నాలుగు రక్తం ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా రెండు సార్లు రక్తం ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. ఇటు స్వచ్ఛందంగా పేద ప్రజలకు సేవ చేస్తూనే ఇటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం ఇవ్వడం చేస్తూనే వున్నాడు ఇతడు చేస్తున్న సేవలను గుర్తించి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సామాజిక ఉద్యమ కార్యకర్తగా అవార్డు అందుకున్నాడు. మండలంలోని వివిధ గ్రామాలలో పూరిల్లు దగ్ధం అయినప్పుడు వారికి తన స్వచ్ఛంద సంస్థ ద్వారా వంట సామాగ్రి మరియు బియ్యం బట్టలను అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. సమాజంలో స్వచ్ఛందంగా ఇతరులకు ఉపయోగపడటం చాలా ఆనందకరమైనని అలాగే రక్తం అవసరం ఉన్నవారికి రక్తం ఇచ్చిన తర్వాత వారి ముఖంలో ఆనందం చూసి నేను ఆనంద పడుతుందని తెలిపారు.