skip to main |
skip to sidebar
జిల్లాలో 30, 30 (ఎ) పోలీసు యాక్ట్ అమలు
మెదక్ జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని, నెల రోజుల (అక్టోబర్ 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా 30, 30 (ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని, జిల్లా ఎస్.పి. కుమారి చందన దీప్తి గారు తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపినారు. అలాగే ప్రజా ధనాన్ని నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్.పి. గారు హెచ్చరించారు. కాబట్టి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు , వివిధ సంఘాల నాయకులు తమకు ఈ విషయం లో సహకరించాలని తెలిపినారు.