skip to main |
skip to sidebar
అరబిందో పార్మ కంపెనీ ముందు ధర్నా
హత్నూర మండలంలోని బోరపట్ల గ్రామ శివారు ఉన్న ఆరోబిందో యూనిట్ 1 ముందు ఆంజనేయులు జెడ్పిటిసి, ఆధ్వర్యంలో హత్నూర మండలానికి చెందిన సర్పంచులు, ఉప సర్పంచ్ లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, వావిలాల నర్సింలు ఎంపిపి, మరియు పరిశ్రమ బాధిత రైతులు 200 మంది ధర్నా లో ఫాల్గొన్నారు.సి. ఎస్.అర్ (CSR/ Corporate Social Responsibility Funds) హత్నూర మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు, వివిధ అభివృద్ధి పనులకు, మండల పరిషత్ (MPDO) కార్యాలయంలో( సి.ఎస్.ఆర్. పరిధిలో ఉన్న ప్రతి సంస్థ యొక్క బోర్డు ప్రతి ఆర్థిక సంవత్సరంలో, తక్షణ కాలంలో చేసిన సగటు నికర లాభాలలో కనీసం 2% ఖర్చు చేస్తుందని నిర్ధారిస్తూ కేంద్ర ప్రభుత్వం 2013 చట్టం) ప్రకారంగా 2% నిధులను డిపాజిట్ చేయాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని. కార్మికులకు వెంటనే గ్రేడ్లు కల్పించాలి. BSc, B.com, BA.I.T.I, Polytechnic, మరియు ఇతర డిగ్రీ విద్యార్థులకు వెంటనే ఉద్యోగం కల్పించాలి. I.T.I మరియు Degree చేసి కార్మికులుగా పనిచేస్తున్న గ్రామస్తులను వెంటనే పర్మినెంట్ చేయాలి. మహిళలకు ఉపాధి అవకాశం కల్పించాలి. న్యాయ పరంగా రావలసిన టాక్స్ వెంటనే చెల్లించాలి. గ్రామాలలో పొల్యూషన్ ద్వారా నష్టపోయిన రైతులు భూములకు నష్టపరిహారం చెల్లించాలి. సి.ఎస్.ఆర్ ఫండ్ 2% మా గ్రామాభివృద్ధికి కేటాయించాలి. బస్సులు, లారీలు, లేబర్ కాంట్రాక్టర్, ఇతర ఉపాధి, అవకాశం కలిగిన పనులు గ్రామస్తుల కేటాయించాలి. ఇతర అరబిందో యూనిట్లలో పనిచేయు మా గ్రామ కార్మికులను యూనిట్-1 కు మార్చాలి అని డిమాండ్ చేసారు. నేరవేర్చక పోతే ఇంకా ఉదృతంచేస్తామని రైతులు అన్నారు.