GAP Line

Main Banner

News Image
News Image
News Image
News Image
News Image

Monday, September 30, 2019

బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి



కరెంట్ షాక్ తో మృతిచెందిన రైతు దంపతుల కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సిహెచ్ మా అన్నయ్య డిమాండ్ చేశారు. హత్నూర మండలం కొన్యాల గ్రామంలో ఇటీవల కరెంట్ షాక్ తో మృతి చెందిన రైతు దంపతుల పిల్లలను ఆదివారం కాంగ్రెస్ నాయకులు పరామర్శించి, రూ.15 వేలు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుల పిల్లలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అధైర్య పడొద్దని పిల్లలను ఓదార్చారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, ఎంపీపీ జ్యోతిసురేష్, సర్పంచ్ వెంకటేశం, నాయకులు మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గుప్తా, రియాజ్ అలీ, నరసింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుజాత, కిష్టయ్య, సత్యం, సుదర్శన్ గౌడ్, మల్లేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.