GAP Line

Main Banner

Monday, October 14, 2019

ఆర్టీసీ కార్మికుడి మృతికి నిరసనగా కొవ్వొత్తులతో ర్యాలీ


ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరికి మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్‌ దేవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఖమ్మం డిపో డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి శనివారం ఖమ్మంలోని తన ఇంటి వద్ద కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన ఆయనను వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు తరలించారు. కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీవో ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఉదయం మృతి చెందారు. శ్రీనివాస్ రెడ్డి ఆత్మకు శాంతి చేకురాలని కోరుతూ ఆదివారం పట్టణంలోని ప్రయాణ ప్రాంగణం నుండి అంబేడ్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు రాజు గౌడ్, శ్యాంసుందర్ గౌడ్ తో పాటు, కాంగ్రెస్ జిల్లా అదికారి ప్రతినిధి, ఆంజనేయులు గౌడ్, బిజెపి నాయకులు పాపగారి రమేష్ గౌడ్, బుచ్చేష్ యాదవ్, సురేష్ నాయక్, ప్రేమ్ కుమార్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.