skip to main |
skip to sidebar
టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా శ్రీనివాస్ గారు రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక..
నర్సాపూర్ లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో.. హత్నూర టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా చిక్ మద్దూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి గారు, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి తనవంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామ కమిటీలు, మహిళా కమిటీలు, విద్యార్థి విభాగం కమిటీలు, జాగృతి కమిటీలు, ప్రతి గ్రామంలో వేయడానికి నా వంతు కృషి చేస్తానని, నాపై నమ్మకంతో మళ్లీ నాకే అధ్యక్ష పదవిని కట్టబెట్టినందుకు ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి గారికి, నాకు సహకరించిన మండల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.