GAP Line

Main Banner

Friday, September 27, 2019

హత్నూర మండలాన్ని నర్సాపూర్ డివిజన్ లో కలపడానికి ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానం

హత్నూర మండలాన్ని నర్సాపూర్ డివిజన్ లో కలిపేందుకు కృషిచేస్తానని.. శుక్రవారం నాడు ఎంపీపీ నర్సింలు, అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో సర్పంచులు ఎంపీటీసీలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు సరిగా లేనందున గ్రామానికి ఒక చెక్ డ్యామ్ నిర్మిస్తామని.. ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళికలు గ్రామాలన్నీ పరిశుభ్రంగా చెత్తాచెదారం లేకుండా దర్శనం ఇవ్వడం చాలా సంతోషకరమని.. ఆయన సర్పంచులు ఎంపీటీసీలు మండల స్పెషల్ అధికారులను ఆయన అభినందించారు. గ్రామస్తులంతా ఏకమైతే సాధించలేనిది ఏమీ లేదని.. ఈ 30 రోజుల ప్రణాళికలు సాధ్యం జరిగిందని ఆయన అన్నారు. గ్రామాల్లో నీటి సమస్య విద్యుత్ పోల్స్ రేషన్ బియ్యం తదితర సమస్యలను సభ దృష్టికి తేగా వాటిని వెంటనే పరిష్కారం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు. మండలానికి 400 కరెంటు స్తంభాలను మంజూరు చేస్తానని గ్రామాలకు అవసరమైనటువంటి స్తంభాలను తీసుకు వెళ్లాలని ఆయన సూచించారు. నర్సాపూర్ నియోజకవర్గానికి విద్యుత్ సమస్య తలెత్తకుండా ఉండడానికి ఇప్పటికే 18 కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలు పంపామని ఆయన అన్నారు. మండలంలోని పన్యాల సబ్స్టేషన్ పనులు నత్తనడకన నడవడంతో వాటిని త్వరలోనే పూర్తి చేయడం కోసం కృషిచేస్తానని సికిండ్లపూర్ గ్రామంలో నూతన సబ్స్టేషన్ కోసం భూమి పూజ త్వరలోనే చేస్తానని ఈ రెండిటినీ పూర్తి చేసినట్టయితే మండలానికి నిరంతర విద్యుత్ సమస్య తీరుతుందని ఆయన ఆయన అన్నారు నీటి సమస్య ఎక్కువగా ఉన్నందున మంజీరాలోకి కాలేశ్వరం నీళ్లు త్వరగా వచ్చేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఆంజనేయులు, ఎంపీడీవో పాల్గొన్నారు.