GAP Line

Main Banner

Tuesday, August 26, 2025

మాసాయిపేటలో 20 మందిపై కుక్కల దాడి.. నలుగురి పరిస్థితి విషమం







మంగళవారం (ఆగస్టు 26) మెదక్ జిల్లాలో మాసాయిపేటలో 20మందిపై వీధికుక్కలు దాడి చేశాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకట్రావుపేటలో ఏడాది చిన్నారిపై దాడితో తీవ్రగాయాలయ్యాయి.

దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. వీధికుక్కల దాడులతో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో స్థానిక ప్రభుత్వం డైలమాలో పడ్డాయి. ఇటీవల ఢిల్లీలో వీధికుక్కల నియంత్రణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వీధికుక్కలను షెల్టర్లకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే జంతు ప్రేమికులు మాత్రం సుప్రీంకోర్టు తీర్పులపై ఆందోళన వ్యక్తం చేశారు.