Showing posts with label N NEWS. Show all posts
Showing posts with label N NEWS. Show all posts
Tuesday, August 26, 2025
Friday, December 8, 2023
డిసెంబరు 9నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
సోనియా గాంధీ పుట్టిన రోజు పురస్కరించుకుని
డిసెంబర్ 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరూ
ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం విషయంలో ఇంకా విధి విధానాలు ఖారారు కాలేదని.. అమలు జరిగిన తర్వాత వచ్చే సమస్యలపై చర్చించి పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు. ఆధార్ కార్డు ఉంటే చాలు.. మహిళలందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించివచ్చని తెలిపారు.
Monday, March 20, 2023
మీ పాన్ కార్డ్ ఆధార్‌తో లింక్ అయ్యిందో లేదో ఇలా చెక్ చేసుకోండి..
పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడం తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
మార్చి 31వ తేదీలోపు పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఏప్రిల్ 1వ తేదీ నుంచి
పాన్ కార్డ్ చెల్లనిదిగా మారిపోతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
సింపుల్ స్టెప్స్ ద్వారా మీ పాన్ ఆధార్ లింక్ అయ్యిందో లేదో ఇలా తెలుసుకోవచ్చు. ఇందు కోసం ముందుగా ఇన్ కమ్ ట్యాక్స్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి.
అనంతరం Link Aadhaar Status పైన క్లిక్ చేయాలి. తర్వాత ఓపెన్ అయిన పేజీలో మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ పాన్ నెంబర్కు ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో తెలుస్తుంది. 2023 మార్చి 31 లోగా పాన్, ఆధార్ లింక్ చేయాలంటే రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
Monday, July 20, 2020
ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 లక్షల విరాళం
నర్సాపూర్: కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అండగా నిలిచేందుకు నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన మాసాయిపేట గ్రామ ప్రజలు ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును నర్సాపూర్ ఎమ్మెల్యే చినుముల మధన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ గారికి ప్రగతిభవన్ లో అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గారు, మెదక్ జిల్లా ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పాల్గొన్నారు.
Tuesday, April 14, 2020
వారణాసిలో చిక్కుకుపోయిన 1000 మంది స్వస్థలాలకు తరలింపు..
వారణాసిలో చిక్కుకుపోయిన తెలుగురాష్ట్రాల యాత్రికులు ఎట్టకేలకు స్వస్థలాలకు వెళ్లనున్నారు. లాక్‌డౌన్ కారణంగా గత నెల 22 నుంచి దాదాపు వెయ్యి మంది వారణాసిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. వారందరినీ స్వస్థలాలకు తరలించనున్నట్టు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు వెల్లడించారు. లాక్‌డౌన్ కారణంగా ఎక్కడివారు అక్కడే ఉండాలన్న నిబంధనలు అమల్లో ఉన్నా.. ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ ప్రధాని నరేంద్రమోదీ ఆమోదంతో వారిని ఏపీ, తెలంగాణలకు ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా తరలించేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం కూడా అనుమతించిందని జీవీఎల్ తెలిపారు. గత నెల 22 నుంచి వారణాసిలో చిక్కుకున్న తెలుగు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి, ఆహార సదుపాయాలు కల్పించడంలో జీవీఎల్ సహకరించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు మొత్తం 15 బస్సులను ఏర్పాటు చేశారు. మిగిలిన వారి తరలింపు కోసం అవసరమైన బస్సులను కూడా ఏర్పాటు చేసే చర్యలు తీసుకుంటున్నట్లు జీవీఎల్ ఆదివారం రాత్రి విలేకరులకు తెలిపారు. తెలుగు రాష్ర్టాల యాత్రికులతో పాటు వారణాసిలో చిక్కుకున్న ఇతర రాష్ర్టాలవారిని కూడా వారి స్వస్థలాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జీవీఎల్ తెలిపారు.
Tuesday, March 31, 2020
మారు వేషంలో విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్
విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలపై ఆరా తీసేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. లాక్‌డౌన్ అమలుతో జనాలు కూరగాయలు, నిత్యావసరాల కోసం జనాలు రోజూ రోడ్డుపైకి వస్తున్నారు. ప్రభుత్వం కూడా ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. అయినా అక్కడక్కడా వ్యాపారులు ధరలు పెంచారనే విమర్శలు వినిపించాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగారు.. వ్యాపారులపై నిఘా పెంచారు. విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ రేట్లపై ఆరా తీసేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ మారు వేషంలో కూరగాయల మార్కెట్లను తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించినట్లు కాకుండా.. ఇష్టానుసారంగా ధరలు పెంచారనే ఫిర్యాదులు రావడంతో.. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌లలో సామాన్య వ్యక్తిలా మారువేషంలో వెళ్లి ధరలను తెలుసుకున్నారు. అలాగే కొనుగోలుదారుల్ని అడిగి ధరల వివరాలు ఆరా తీశారు. కొన్ని కూరగయాల మార్కెట్లలో కొన్ని చోట్ల ధర కంటే రూ.5 ఎక్కువ అమ్ముతున్నట్లు గుర్తించారు జాయింట్ కలెక్టర్. అధికారులతో చర్చించి.. రేట్లు తగ్గించేందుకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే కొద్దిసేపటి తర్వాత మారు వేషంలో మార్కెట్‌కు వచ్చింది జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ అని తెలుసుకుని షాక్ తిన్నారు.
Saturday, March 14, 2020
కంచె వేస్తేనే రక్ష.. లేకుంటే కబ్జా.!
నర్సాపూర్‌లో రూ.25 కోట్ల విలువైన స్థలాలు రెవెన్యూ శాఖ గుర్తింపు పురపాలికకు అప్పగింతకు నిర్ణయం కాపాడుకోవాల్సిన అవశ్యం
న్యూస్‌టుడే, నర్సాపూర్ పట్టణంలో ప్రభుత్వ స్థలాలు లభించక అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. ఈ కారణంతో ప్రగతి నిధులు తరలిపోతుంటే అధికారులు ఉన్న స్థలాలను కాపాడే ప్రయత్నం చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండగా అసైన్డ్ భూములు కొనుగోలు చేయడం, లేదంటే ఆలయ భూములను ప్రతిపాదించడం చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ భూములు లభించే పరిస్థితి లేకపోవడంతో ఇటీవల రెవెన్యూ అధికారులు పట్టణంలో సర్వే చేసి విలువైన సర్కారు స్థలాలను గుర్తించి పురపాలికకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. అంతవరకు బాగానే ఉన్నా వాటిని పురపాలికకు స్వాధీనం చేసే వరకు అలాగే వదిలేస్తే అన్యాక్రాంతమయ్యే ప్రమాదం పొంచి ఉంది.పట్టణంలో అత్యంత విలువైన ప్రభుత్వ స్థలాలు ఉన్నా... ఇదివరకు ఇక్కడ పనిచేసిన అధికారులు వాటిని ఉపయోగించకుండా స్థలం లేదని పేర్కొనడంతో నర్సాపూర్‌నకు మంజూరైన ఆదర్శ పాఠశాల, గోమారంలోని పాలిటెక్నిక్, పెద్దచింతకుంటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు... పక్క గ్రామాలు, మండలాలకు తరలిపోయాయి. అయినా ఎప్పుడో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సర్వే నెంబరు 79లోని స్థలాల జోలికి మాత్రం అధికారులు వెళ్లడం లేదు. సుమారు 10 ఎకరాల భూముల్లో మాత్రం ‘ఇది ప్రభుత్వ భూమి.. ఆక్రమించినచో శిక్షార్హులు’ అంటూ బోర్డులు దర్శనం ఇస్తాయి. ఇలా సుమారు రూ.10 కోట్ల విలువైన భూములు కొన్నేళ్లుగా అలా పడి ఉన్నాయి. సంబంధిత అధికారులు మాత్రం ఎందువల్లో వాటి వైపు చూడటం లేదు. ప్రగతి పనులకు ప్రతిపాదించడానికి చొరవ చూపడం లేదు. ఈ స్థలాల్లోకి తరచూ ఆక్రమణదారులు చొరబడుతున్నారు. వేసిన కంచెను ధ్వంసం చేయడం, సాగు చేయడం వంటివి చేస్తున్నారు. నూతన పురపాలిక చట్టం ఆమోదం పొందిన ఏడాదిలోగా బల్దియా పరిధిలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి ప్రహరీ, ఇనుప కంచెలు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పట్టణంలో గుర్తించిన ప్రభుత్వ స్థలాల చుట్టూ కంచెలు, ప్రహరీ నిర్మించాలంటే రూ.లక్షలు అవసరం అవుతాయి. ఇప్పటికే నిధులు లేక నీరసించి పోతున్న బల్దియాకు ఇదొక సమస్యగా మారింది.
‘ప్రగతి’కి అనుకూలమైన స్థలాలు..
పట్టణంలో రెవెన్యూ అధికారులు గుర్తించిన విలువైన స్థలాలు ప్రగతి పనులకు ఎంతో అనుకూలం. ముఖ్యంగా సర్వే నెంబరు 79లో గుర్తించిన 16-35 ఎకరాల్లో సుమారు పది ఎకరాలకు మాత్రమే రక్షణ కంచె వేశారు. రూ.కోట్ల విలువైన ఈ స్థలాలు ఇళ్ల మధ్యన ఉండగా ఆక్రమణలకు అవకాశాలున్నాయి. వినాయక్ నగర్ కాలనీలో ప్రస్తుతం గుర్తించిన స్థలాలను పట్టణ ప్రగతి కార్యక్రమం కింద చదును చేశారు. పిచ్చి మొక్కలు, ముళ్లపొదలను తొలగించారు. జేసీబీలతో శుభ్రం చేశారు. రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో అక్రమార్కులు పాగా వేయడానికి పావులు కదుపుతున్నారు. ప్రస్తుతానికి 79 సర్వేనెంబరులో 1-10 ఎకరాల్లో ఆక్రమణలు ఉన్నాయని అధికారులు సర్వేలో తేల్చారు. పక్కా నిర్మాణాలకు బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. కొన్ని నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. మరికొన్ని పూర్తయి వినియోగంలో ఉన్నాయి. షాదీఖానా సమీపంలో సర్వే నెంబరు 3లో 30 గుంటల స్థలాన్ని గుర్తించారు. ఇక్కడ గజం స్థలం రూ.10-20 వేల వరకూ పలుకుతోంది. ఇంతటి విలువైన స్థలాన్ని చదును చేసి వృథాగా వదిలేశారు. శివాలయం వీధిలో 76 సర్వే నెంబరులో 2-20 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించగా కంచె ఏర్పాటు చేయకపోవడంతో పలువురు ఆక్రమించుకున్నారు. గతంలో గొర్రెలు, మేకల విక్రయ మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదించగా అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. స్థలాన్ని గుర్తించిన వెంటనే బోర్డు, కంచె ఏర్పాటు చేసి ఉంటే అన్యాక్రాంతం అయ్యేది కాదని అంటున్నారు. ఇలా ఎంతో విలువైన ప్రభుత్వ స్థలాల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అన్యాక్రాంతం అవుతున్నాయని పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పురపాలికకు మ్యాపులు అందజేశాం- మాలతి, తహసీల్దార్, నర్సాపూర్
పట్టణ పరిధిలో గుర్తించిన ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన మ్యాపులు పురపాలికకు అందజేశాం. పురపాలికకు అప్పగించాలంటూ పాలనాధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి అనుమతులు రాగానే స్థలాలను అప్పగిస్తాం. విలువైన స్థలాలు కావడంతో వీలైనంత త్వరగా రక్షణ చర్యలు తీసుకుంటే బాగుంటుంది.
Friday, July 26, 2019
Tuesday, July 16, 2019
Wednesday, June 12, 2019
Tuesday, June 11, 2019
Saturday, June 8, 2019
Wednesday, June 5, 2019
Tuesday, June 4, 2019
Friday, May 31, 2019
Friday, May 24, 2019
Tuesday, May 7, 2019
Tuesday, April 30, 2019
Monday, April 22, 2019
Subscribe to:
Posts (Atom)
Powered by Blogger.
Narsapur Constituency - Shops - Details
- Art (3)
- Automobile (3)
- Bangle Store (3)
- Book Stores (8)
- Chikan Center (2)
- Cloth Store (5)
- Diagnostic (1)
- Electrical (3)
- Electronics (9)
- Foot Wear (4)
- Gas Agency (1)
- Hospital (2)
- Jewellery Work Shop (4)
- Kirana General Store (6)
- Medical (6)
- Mobile Store (24)
- Photo Studio (13)
- Printing Press (2)
- School (3)
- Tailor Shop (8)