పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడం తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
మార్చి 31వ తేదీలోపు పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఏప్రిల్ 1వ తేదీ నుంచి
పాన్ కార్డ్ చెల్లనిదిగా మారిపోతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
సింపుల్ స్టెప్స్ ద్వారా మీ పాన్ ఆధార్ లింక్ అయ్యిందో లేదో ఇలా తెలుసుకోవచ్చు. ఇందు కోసం ముందుగా ఇన్ కమ్ ట్యాక్స్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి.
అనంతరం Link Aadhaar Status పైన క్లిక్ చేయాలి. తర్వాత ఓపెన్ అయిన పేజీలో మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ పాన్ నెంబర్కు ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో తెలుస్తుంది. 2023 మార్చి 31 లోగా పాన్, ఆధార్ లింక్ చేయాలంటే రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.