GAP Line

Main Banner

Tuesday, April 14, 2020

వారణాసిలో చిక్కుకుపోయిన 1000 మంది స్వస్థలాలకు తరలింపు..



వారణాసిలో చిక్కుకుపోయిన తెలుగురాష్ట్రాల యాత్రికులు ఎట్టకేలకు స్వస్థలాలకు వెళ్లనున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా గత నెల 22 నుంచి దాదాపు వెయ్యి మంది వారణాసిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. వారందరినీ స్వస్థలాలకు తరలించనున్నట్టు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు గారు వెల్లడించారు. లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కడివారు అక్కడే ఉండాలన్న నిబంధనలు అమల్లో ఉన్నా.. ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ ప్రధాని నరేంద్రమోదీ ఆమోదంతో వారిని ఏపీ, తెలంగాణలకు ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా తరలించేందుకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి కార్యాలయం కూడా అనుమతించిందని జీవీఎల్‌ తెలిపారు. గత నెల 22 నుంచి వారణాసిలో చిక్కుకున్న తెలుగు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి, ఆహార సదుపాయాలు కల్పించడంలో జీవీఎల్‌ సహకరించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు మొత్తం 15 బస్సులను ఏర్పాటు చేశారు. మిగిలిన వారి తరలింపు కోసం అవసరమైన బస్సులను కూడా ఏర్పాటు చేసే చర్యలు తీసుకుంటున్నట్లు జీవీఎల్‌ ఆదివారం రాత్రి విలేకరులకు తెలిపారు. తెలుగు రాష్ర్టాల యాత్రికులతో పాటు వారణాసిలో చిక్కుకున్న ఇతర రాష్ర్టాలవారిని కూడా వారి స్వస్థలాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జీవీఎల్‌ తెలిపారు.