GAP Line

Main Banner

Showing posts with label Telangana News. Show all posts
Showing posts with label Telangana News. Show all posts

Saturday, September 21, 2019

పాతబస్తీకి మెట్రో.. ఖరారైన స్టేషన్ల పేర్లు


హైదరాబాద్ పాతబస్తీలో సున్నితమైన అంశాలతో కూడిన చారిత్రక, మతపరమైన కట్టడాలకు ఏమాత్రం నష్టం జరుగకుండా ఐదు స్టేషన్లతో 5.5 కిలోమీటర్ల మెట్రోనిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇప్పటికే 5.5 కిలోమీటర్ల మార్గంలో నిర్మించనున్న 5 స్టేషన్ల పేర్లు ఖరారయ్యాయి. [1] సాలర్జంగ్ మ్యూజియం స్టేషన్, [2] చార్మినార్ స్టేషన్, [3] శాలిబండ స్టేషన్, [4] శంషేర్‌గంజ్ స్టేషన్, [5] ఫలక్‌నుమా స్టేషన్లుగా నిర్మించనున్నారు. మెట్రో అలైన్‌మెంట్ ప్రకారం సాలర్జంగ్ మ్యూజియం, చార్మినార్ కట్టడాలు 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ వీటికున్న ప్రత్యేకత, చారిత్రక నేపథ్యం దృష్ట్యా వీటిపేర్లను ఖరారుచేశారు.


Monday, September 16, 2019

కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించొదన్న హైకోర్టు


తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఎర్రమంజిల్‌లో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలన్న మంత్రిమండలి ప్రతిపాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఎర్రమంజిల్‌లోని అసెంబ్లీ భవనం నిర్మించొద్దని ఆదేశించింది. కొత్త అసెంబ్లీ భవనం కోసం ఎర్రమంజిల్‌లోని పురాతన భవనాలను కూల్చకూడదని స్పష్టంచేసింది కోర్టు. ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నవాదనతో ఏకీభవించింది. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఎర్రమంజిల్ ప్యాలెస్‌ కూల్చివేతపై నిజాం వారసులు, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు కోర్టుకెక్కారు. అసెంబ్లీ భవనం కోసం చారిత్రక భవనాన్నికూల్చడం ఎంత వరకు సమంజసమని వాదించారు. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఎర్రమంజిల్‌లో అసెంబ్లీని కట్టకూడదని ఆదేశించింది. కాగా ఎర్రమంజిల్‌లో మొత్తం 16 ఎకరాల స్థలంలో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తోంది తెెలంగాణ ప్రభుత్వం. అసెంబ్లీ భవనానికి జూన్ 27న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. వచ్చే ఉగాది లోపు కొత్త సచివాలయంతో పాటు కొత్త అసెంబ్లీ నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఆ దిశగా పనులు కూడా జరుగుతున్నాయి. ఐతే ఎర్రమంజిల్‌లో పురాతన భవనాల కూల్చివేతకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలవడంతో దానిపై విచారించిన కోర్టు, అక్కడి భవనాలను కూల్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

Thursday, August 29, 2019

నేడు "తెలుగు భాషా దినోత్సవం"



తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామ్మూర్తి గారి పుట్టిన రోజు ఈ రోజు.. ముఖ్యంగా గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని, ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు మన రామ్మూర్తి గారు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది. గిడుగు రామ్మూర్తి పుట్టిన రోజు అయిన ఈ రోజు...ఆగష్టు 29 ని "తెలుగు భాషా దినోత్సవం"గా జరుపుకుంటున్నాము. అయితే...ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా వేరుపడిన తరువాత తెలంగాణా వారు కాళోజీ జన్మదినోత్సవాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు అందరం తెలుగులోనే మాట్లాడుదాము, తెలుగు తియ్యదనాన్ని ఆస్వాదిద్దాం.