GAP Line

Main Banner

Wednesday, August 28, 2019

ఇండియా ఇక పేద దేశం కాదు: ఇస్రో చైర్మన్ కె.శివన్








రిమోట్ ​సెన్సింగ్​లో మనమే నెం.1

రిమోట్ ​సెన్సింగ్ శాటిలైట్ ​టెక్నాలజీలో మనం ప్రపంచంలోనే టాప్ ప్లేస్​లో ఉన్నాం. వరి, గోధుమల ఉత్పత్తిలో వరల్డ్​నెం.2గా ఉన్నాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఏడో పవర్​ఫుల్​ఎకానమీ మనది. ఐటీ రంగంలోనూ దూసుకుపోతున్నాం. ఇండియా ఇంకా పేద దేశం ఎలా అవుతుంది? బెంగళూరులోని జైన్​డీమ్డ్​యూనివర్సిటీ స్టూడెంట్లకు ఇండియన్​స్పేస్​రీసెర్చ్​ఆర్గనైజేషన్​(ఇస్రో) చైర్మన్​డాక్టర్​కె. శివన్​సంధించిన ప్రశ్న ఇది. సోమవారం ఆ యూనివర్సిటీ కాన్వొకేషన్​ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. 1960లో ఇండియా అంతరిక్ష ప్రయోగాలు చేయడం అనేది ఓ క్రేజీ ఐడియాగా అనిపించేది. కానీ, విక్రమ్​ సారాభాయ్​ దూరదృష్టితో ఇండియా స్పేస్​ టెక్నాలజీలో పట్టు సాధించి, దానిని అభివృద్ధి కోసం ఉపయోగిస్తోందని ఆయన తెలిపారు. ‘ఇండియాలాంటి పేద దేశానికి ఇప్పుడు స్పేస్​టెక్నాలజీ వంటివి అవసరమా?’ అన్న వాదనలను ఆయన తిరస్కరించారు. ఇప్పుడు ఇండియా ఆర్థికంగా శక్తిమంతమైన దేశమని, అందువల్ల స్పేస్ ​టెక్నాలజీతో కామన్​ మ్యాన్ కు లాభం కలిగించే అనేక ఆవిష్కరణలు చేయడం అవసరమేనని అన్నారు.