GAP Line

Main Banner

Sunday, September 22, 2019

మత్స్యకారులకు ప్రభుత్వ చేయూత



హత్నూర : మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న తెలంగాణ సర్కార్ అని హత్నూర జడ్పిటిసి సభ్యులు ఆంజనేయులు, మత్స్య సహకార సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నర్సింలు, అన్నారు. శనివారం నాడు మండల పరిధిలోని చింతల్ చెరువు పెద్ద చెరువు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన చేపపిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పెద్దపీట వేస్తుందని ఆయన అన్నారు. మత్స్యకారుల జీవనోపాధి కోసం ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు గారు, కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేసి పలురకాల సామాగ్రి అంద చేసిందన్నారు. ఉచితంగా చేప పిల్లలను ప్రాజెక్టులు చెరువుల్లో వదిలి మత్స్యకారులకు ఉపాధి అవకాశం కల్పిస్తారని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా రవాణా సౌకర్యం వివిధ రకాల వాహనాలను పూర్తి సబ్సిడీతో ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. మత్స్య కార్మికులు ఏదైనా ప్రమాదంలో చనిపోతే ఆ వ్యక్తికి ప్రభుత్వం తరఫున 11 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క మత్స్య కార్మికుడు తమ తమ గ్రామాల కమిటీలలో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం జడ్పిటిసి ఆంజనేయులు, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింలు, డైరెక్టర్లను పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంబటి సుధాకర్, టి ఆర్ ఎస్ నాయకులు పండగ రవికుమార్, అంబటి అర్జున్, నర్సింలు, లక్ష్మణ్, గొల్ల కృష్ణ, మరియు మత్స్య కార్మికులు పాల్గొన్నారు.