GAP Line

Main Banner

Thursday, August 29, 2019

ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు ని ఘనంగా సన్మానించిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు


ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ గెలిచిన పీవీ సింధును సీఎం కేసీఆర్ అభినందించారు. గోల్డ్ మెడల్ సాధించిన సింధు దేశానికి గర్వకారణంగా నిలిచిందని కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. భవిష్యత్తులో జరిగే టోర్నమెంట్లలో పాల్గొనేందుకు, సిద్ధమయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వ పరంగా చేస్తామని హామీ ఇచ్చారు. పివి సింధు, ఆమె తల్లిదండ్రులు, కోచ్ గోపీ చంద్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాముండేశ్వరి నాథ్ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిశారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో విజేతలను తయారు చేసేవేదికగా హైదరాబాద్ మారిందన్నారు సీఎం కేసీఆర్. 
బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో గెలిచిన గోల్డ్‌మెడల్‌ను సీఎం కేసీఆర్‌కు చూపించారు పీవీ సింధూ. రెండు రాకెట్లను సీఎంకు బహుకరించారు. పీవీ సింధుకు పుష్పగుచ్చం ఇచ్చి, షాలువా కప్పి సన్మానించారు సీఎం కేసీఆర్.