skip to main |
skip to sidebar
హుజూర్‌నగర్ తెరాస అభ్యర్థి సైదిరెడ్డి గారు
తెలంగాణలో హుజూర్‌నగర్ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో తెరాస తన అభ్యర్థిని ప్రకటించింది. ఈ స్థానానికి పార్టీ నుంచి మరోసారి సైదిరెడ్డిని బరిలోకి దింపింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షకులు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి అక్టోబరు 21న ఉప ఎన్నిక నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం సెప్టెంబరు 23న నోటిఫికేషన్ విడుదల కానుంది. సెప్టెంబరు 30తో నామినేషన్ల స్వీకరణకు గడువు ముగుస్తుంది. అక్టోబరు 1న నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 3 వరకు గడువు విధించారు. అక్టోబరు 21న ఎన్నికలు నిర్వహించి అక్టోబరు 24న ఫలితాలు వెల్లడించనున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ స్థానం నుంచి గెలుపొందిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి..ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీగా గెలుపొందడంతో హుజూర్‌నగర్ స్థానం ఖాళీ ఏర్పడింది. గత ఎన్నికల్లో తెరాస నుంచి బరిలోకి దిగిన సైదిరెడ్డి.. ఉత్తమ్ కుమార్ చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే.