skip to main |
skip to sidebar
మృతిచెందిన రైతు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు
హత్నూర మండల పరిధిలోని కొన్యాల గ్రామంలో పొలం వద్ద కరెంట్ షాక్ తో ఇద్దరు రైతులు అదే కుటుంబానికి చెందిన రెండు ఎడ్లు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన పలువురుని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది అని ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆవేదనవ్యక్తంచేశారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, కొన్యాల గ్రామంలోని బాధితులు ఇంటికెళ్లి పరామర్శించారు. ఇంటి పెద్ద దిక్కు అయిన అమ్మ నాన్న చనిపోయి అనాధలైన ముగ్గురు పిల్లలను చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయనిధి ద్వారా కుటుంబాన్ని ఆదుకుంటామని వారిని హాస్టల్ లో చేర్పించి మంచి చదువులు చెప్పిఇస్తామని హామి ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట తెరాస రాష్ట్ర నాయకులు అశోక్ గౌడ్, హత్నూర తెరాస నాయకులు గ్రామ సర్పంచ్ మరియు కార్యకర్తలు ఉన్నారు..