GAP Line

Main Banner

Friday, September 27, 2019

అంగన్వాడీ ఆధ్వర్యంలో ఘనంగా కుటుంబ పోషణ మాసోత్సవంనర్సాపూర్ స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం నందు కుటుంబ పోషణ మాసోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మన నర్సాపూర్ శాసనసభ్యులు చిలుముల మదన్ రెడ్డి గారు హాజరై నేటి సమాజంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని దాని కోసం మంచి ఆహారాన్ని అందించడం ముఖ్యమని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లో నియోజకవర్గ స్థాయి అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన చిరుధాన్యాల స్టార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రత్యేక అధికారి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, తెరాస నాయకులు అశోక్ గౌడ్, హబీబ్ ఖాన్, శేఖర్ బిక్షపతి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.