skip to main |
skip to sidebar
నర్సాపూర్ మున్సిపాలిటీకి చెత్త సేకరించడానికి ఆటోలు
నర్సాపూర్ మున్సిపాలిటీకి చెత్త సేకరించడానికి నాలుగు నూతన ఆటోలను కేటాయించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు జిల్లా కేంద్రమైన మెదక్ లో మున్సిపాలిటీలకు సంబందించిన కొత్త వాహనాలను ప్రారంభించగా, అందులోని నాలుగు నర్సాపూర్ కు కేటాయించడంతో గురువారం నర్సాపూర్ మున్సిపాలిటీకి చేరుకున్నాయి. కొత్త వాహనాలు రావడంతో ఇబ్బంది తీరనుందని సిబ్బంది సంతోషం వ్యక్తం చేసారు.