skip to main |
skip to sidebar
హుజూర్‌నగర్ బీజేపీ అభ్యర్థిగా కోట రామారావు
బీజేపీ హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా కోట రామారావును బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఎంపిక చేసింది. టికెట్ రేసులో శ్రీకళారెడ్డి, జిల్లేపల్లి వెంకటేశ్వరరావు, బొబ్బా భాగ్యారెడ్డి, ఎన్‌ఆర్‌ఐ కోటా అప్పిరెడ్డి ఉండగా చివరకు రామారావుకు టికెట్ దక్కింది. మొదట శ్రీకళా రెడ్డికి టికెట్ ఖరారు అవ్వగా కుటుంబ సభ్యుల ఒత్తిడితో పోటీ నుండి తప్పుకున్నారు. కాగా, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్ నుంచి శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి పద్మావతిరెడ్డి బరిలోకి దిగుతున్నారు. నామినేషన్లకు ఈనెల 30 వరకూ గడువు ఉంది. అక్టోబరు 21న పోలింగ్ జరిగి, అదే నెల 24న ఫలితాలు విడుదల కానున్నాయి.