GAP Line

Main Banner

Friday, September 27, 2019

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం



నర్సాపూర్ లో రోటరీ క్లబ్ అధర్వoలో.. జాతీయ, అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నర్సాపూర్ రోటరీ క్లబ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సపూర్ ఆర్డీఓ అరుణ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లాలోని 11 మండలానికి చెందిన ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయుడిగా నేషనల్ బిల్డర్ 2019 అవార్డుకు మండల పరిధిలోని మక్తభూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు నాగేందర్, గుట్టకిందిపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన సంతోశ్‌కుమార్, వెంకటాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిద్ధిరాములు, మెదక్ జంబికుంట ప్రాథమిక పాఠశాలకు చెందిన ప్రశాంతిలు ఎంపికావడంతో నర్సాపూర్‌లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి వారిని ఘనంగా సన్మానించారు. ఉపాద్యాయులు మాత్రమే ఇంజినీర్లను, డాక్టర్లను, రాజకీయనాయకులను, ఐఏఎస్, ఐపీఎస్ లను తయారుచేయగలరని ఆమెఅన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగిన గురువులను మాత్రమే గుర్తుంచుకొంటారని.. అలాంటి ఉపాద్యాయులకు తన చేతుల మీదుగా సన్మానించాడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి హన్మంత్ రెడ్డి, పూసల లింగాగౌడ్, గుండం మోహన్ రెడ్డి, నర్సాపూర్ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నర్సింహారెడ్డి, కార్యదర్శి నాగరాజు, ఎండిఎల్ పి ఏంజిఓ మేనేజర్ దయాకర్ రెడ్డి, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సాయికిరణ్ మరియు వివిధ మండలాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.