నర్సాపూర్ పోలీసులు శ్రమదానం కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ అందులో పాల్గొంటూ క్లీన్ అండ్ గ్రీన్ లో తాము సైతం అంటూ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ పోలీస్ సిబ్బంది, సీఐ నాగయ్య గారు, ప్రజాప్రతినిధులు, యువకులు అన్ని రాజకీయ పార్టీల నాయకులతో పాటు తెరాస పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు మురళి యాదవ్ గారు, అశోక్ గౌడ్ గారు, యువజన సంఘాలు ఫాల్గొన్నారు. అందరూ కలిసి రాయ రావు చెరువు లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టారు. చెరువులో మొత్తం గణేష్ విగ్రహాల అవశేషాలు మరియు ప్లాస్టిక్ బాటిల్స్ తోపాటు చెరువులో కూరుకుపోయిన చెత్త ప్లాస్టిక్ బాటిల్ లను తొలగించి చెరువులు ఆనుకుని ఉన్న పిచ్చి ముక్కల్ని చెత్తాచెదారాన్ని తొలగించారు.