skip to main |
skip to sidebar
ప్రధానమంత్రి మోడీ గారి జన్మదిన వేడుకలు
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని మంగళవారం స్థానిక బీజేపీ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాపగారి రమేష్ గౌడ్ మాట్లాడుతు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చయ్ వాలా నుండి దేశ ప్రధానమంత్రిగా దేశ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం పేదల కోసం ఉచిత గ్యాస్, జన్ధన్ యోజన, జీరో అకౌంట్, లాంటి అనేక పథకాలు అమలు చేయడంతో పాటు ఆర్టికల్ 370 అమలు లాంటి నిర్ణయాలు తీసుకుని ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాయకుడు మోడీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు నియోజకవర్గ కన్వీనర్ రాజేందర్, రఘువీరారెడ్డి, మాణయ్య, వినోద్, బాల్ రాజ్, దిగంబర్, బాల్ రెడ్డి, సంగమేశ్వర్, శ్రీనివాస్, వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.