GAP Line

Main Banner

Wednesday, September 11, 2019

శివాలయంలో అన్నదానం నిర్వహించిన సంగసాని నర్సింగరావు



నర్సాపూర్లో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నర్సాపూర్ పట్టణంలోని శివాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మంగళవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నర్సాపూర్ పట్టణానికి చెందిన సంగసాని నర్సింగరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంగసాని నర్సింగరావు దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయకునికి ప్రత్యేక పూజలు ఆలయ పూజారి వీరప్ప గురూజీ వేద మంత్రోచ్ఛారణలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ ఐ సత్యనారాయణ ను సంగసాని నర్సింగరావు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అన్నదాత సంగసాని నర్సింగరావు దంపతులు, ఆలయ పూజారి వీరప్ప గురూజీ, స్థానిక ఎస్ఐ సత్యనారాయణ, ఎంపీపీ జ్యోతిసురేష్ నాయక్, మాజీ ఎంపిటిసి సంగసాని సురేష్, ప్రేమ్ కుమార్, మేఘారాజ్, విగ్రహ దాత బల్లెం శ్రీనివాస్, పాపగారి రమేష్ గౌడ్, బట్టు చంద్రశేఖర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.