skip to main |
skip to sidebar
అక్టోబర్ 1 నుంచి SBI కొత్త ఛార్జీలు..
ఎస్బీఐ కస్టమర్స్ కి మరో షాకింగ్ న్యూస్. అక్టోబర్ 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు అమలు చేయనున్నట్లు ప్రకటించింది . మనీ డిపాజిట్, విత్ డ్రా, చెక్ బుక్ వాడడం పై సర్వీస్ ఛార్జీలు విధించనుంది. కొత్త రూల్స్ ప్రకారం ఎస్బీఐ కస్టమర్స్ నెలకు మూడు సార్లు మాత్రమే ఉచితంగా మనీ డిపాజిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత డిపాజిట్ చేస్తే రూ.50 ఛార్జ్ కట్టాల్సి వస్తుంది. దీనికి జీఎస్టీ అదనం. ఇలా ఒక నెలలో ఐదో సారి డిపాజిట్ చేస్తే రూ.56 ఛార్జ్ అవుతుంది. చెక్ బౌన్స్ అయితే రూ.150 దీనికి కూడా జీఎస్టీ అదనం. అలాగే మెట్రో నగరాల్లో ఎస్బీఐ ఏటీఎంలో లావాదేవీల సంఖ్య 10 కి పెరగనున్నాయి. నాన్ మెట్రో నగరాల్లో ఎస్బీఐ ఏటీఎంలో ఎలాంటి ఛార్జీలు లేకుండా 12 సార్లు డ్రా చేసుకోవచ్చు. ఇతర ఏటీఎంలలో కేవలం ఐదు మాత్రమే ఉచితంగా జరపవచ్చు.