skip to main |
skip to sidebar
పాతనగరంలో గురునానక్ ప్రకాష్ యాత్రకు ఘాన స్వాగతాం..
పాత నగరంలో ప్రధాన రహదారుల నుండి గురువారం సాయంత్రం గురునానక్ ప్రకాష్ యాత్ర కన్నుల పండువగా సాగింది. శ్రీ గురునానక్ దేవ్ జీ మహారాజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కర్ణాటక లోని బీదర్ నుండి నగరానికి చేరుకున్న గురునానక్ ప్రకాష్ యాత్ర గౌలిగూడ గురుద్వారా చేరుకుంది. అక్కడి నుండి గురువారం సాయంత్రం నయాపూల్, మదీనా, పేట్లబుర్జ, పురానాపూల్, బహదూర్ పురా మీదగా కిషన్ బాగ్ సిక్కుచావునీ సమీపంలోని అసాసింగ్ బాగ్ గురుద్వారా చేరుకుంది. పేట్లబుర్జ వద్ద యాత్రకు చార్మినార్ ఎమ్మెల్యే మొహ్మద్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ గారు మజ్లిస్ కార్యకర్తలతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు.