skip to main |
skip to sidebar
వందేళ్లల్లో అతిపెద్ద వర్షం..అందరికీ ధన్యవాదాలు..కేటీఆర్

మంగళవారం హైదరాబాద్‌లో కురిసిన అతి భారీ వర్షం నగరాన్ని జలమయం చేసింది. సెప్టెంబర్ నెలలో ఈ స్థాయిలో వర్షాలు పడడం 111 ఏళ్లలో ఇదే మొదటిసారని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్వాల్, కాప్రా, మల్కాజిగిరి, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, యూసుఫ్‌గూడ, మెహిదీపట్నం, చార్మినార్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, గోషామహల్, అంబర్‌పేట్, బేగంపేట్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ముసాపేట్, ఉప్పల్ ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. సగటున 1 సెంటీమీటర్ నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసింది. అయితే, 1908లో సెప్టెంబరు 27న హైదరాబాద్‌లో 15.3 సెం.మీల వర్షపాతం నమోదైంది. దాదాపు 111 ఏళ్ల తర్వాత మంగళవారం 24 గంటల్లో కురిసిన 12.1 సెంటీమీటర్ల వర్షమే అత్యధికం. సెప్టెంబర్‌లో గత 111 ఏళ్లలో ఇదే రికార్డు స్థాయి వర్షపాతమని అధికారులు చెబుతున్నారు. అయితే, భారీ వశ్రామ్ను సైతం లెక్కచేయకుండా సహాయక చర్యలు కొనసాగించారు జీహెచ్ఎంసీ అధికారులు. ఓ వైపు పోలీసులు, విద్యుత్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఇలా సంస్థలు భాగస్వాములై నగర వాసులకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు ప్రయత్నించారు. వారందరికీ మంత్రి కేటీఆర్ గారు ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఇంతటి అతి భారీ వర్షపాతం వందేళ్ల తర్వాత నమోదైంది.. వర్షాలపై అప్రమత్తంగా ఉన్న అధికారులు, సిబ్బందికి, పోలీసులకు ధన్యవాదాలు చెబుతున్న అని ట్వీట్ లో పేర్కొన్నారు.