skip to main |
skip to sidebar
చిన్నారి చివరి కోరికను తీర్చిన తల్లి
నవ్వుతూ, తుళ్లుతూ ఇంట్లో సందడి చేసే చిన్నారి చనిపోతే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. అప్పుడు వారికి ప్రపంచమే శూన్యంగా కనిపిస్తుంది. అయితే మధ్యప్రదేశ్ ఖండ్వాలో దీనికి భిన్నంగా జరిగింది. రోడ్డు ప్రమాదంలో కుమార్తెను కోల్పోయిన తల్లి ఆ చిన్నారి చివరి కోర్కెను తీర్చింది. రోడ్డు ప్రమాదంలో ఒక ట్రాలీ...స్కూలు పిల్లలతో వెళుతున్న ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఉమె అమిన్ (7) సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. కాగా ఉమె ఇటీవల స్కూల్లో జరిగిన పరీక్షల్లో క్లాస్‌లో టాపర్‌గా నిలిచింది. దీంతో క్లాసులోని పిల్లలందరికీ చాక్లెట్లు ఇవ్వాలనుకుంటున్నానని తల్లికి చెప్పింది. అయితే ఇంతలోనే ఊహించని విధంగా ఆ చిన్నారి మృత్యువాత పడింది. ఉమె అమిన్ తండ్రి దుబాయ్‌లో ఉంటున్నాడు. మూడవ తరగతి చదువుతున్న ఉమె అమిన్ మృతి నేపధ్యంలో ఆ చిన్నారి కూర్చునే బెంచ్‌పై ఆ పాప ఫొటోను ఉంచారు. ఉమె రూపొందించిన పెయింటింగ్స్ క్లాసులోని గోడలకు తగిలించారు. ఉమె అమిన్ తల్లి తన కుమార్తె కోరిన విధంగా తరగతిలోని పిల్లలందరికీ చాక్లెట్లు పంచారు. ఈ సందర్భంగా తరగతిలోని ఉమె తోటి విద్యార్థులు తమ స్నేహితురాలిని తలచుకుని కంటనీరు పెట్టుకున్నారు.
హిందీ ఈ పేపర్ లింక్ 👇