GAP Line

Main Banner

Saturday, October 19, 2019

సంపూర్ణ బంధు - అఖిలపక్షం నాయకుల ర్యాలీ



ఆర్టీసీ కార్మికులు పిలుపు మేరకు తెలంగాణ బంద్ కు మద్దతుగాను శనివారం నర్సాపూర్ లో బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. వ్యాపార, వాణిజ్య, సంస్థలు వారి వారి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, ప్రతీ చోట ఉదయం నుంచి అన్నీ దుకాణాలను మూసివేశారు. రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బిజెపి, సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బంద్ లో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగనివ్వకుండా వివిధ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకుడు పాపగారి రమేష్ గారు మాట్లాడుతూ కేసీఆర్ మొండి వైఖరితో ఉద్యోగస్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ, చర్చలకు పిలువకుండా మొండివైఖరితో ఉండడంతో హైకోర్టు సైతం మొట్టికాయలు వేసిందని వారన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి పంతానికి పోకుండా, ప్రజాల సమస్యలు తీర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బిజెపి, సిపిఐ, సిపిఎం నాయకులు, ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.