GAP Line

Main Banner

News Image
News Image
News Image
News Image
News Image

Saturday, October 19, 2019

తెలంగాణ బంద్ ▸ తెగిన నేత బొటన వేలు



తెలంగాణ బంద్ నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు నేతలను, కార్మికులను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద నిరసనకు దిగిన సీపీఐ ఎంఎల్ నేత రంగారావును అరెస్ట్ చేసి పోలీస్ వ్యానులోకి ఎక్కించారు. ఈ క్రమంలో..తన వేలును తలుపుల మధ్య పెట్టి గట్టిగా నొక్కేశారని రంగారావు ఆరోపిస్తున్నారు. పోలీసుల చర్యకు ఆయన బొటనవేలు తెగిపోయి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రంగారావును చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రికి రంగారావుని తరలించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు..ఇప్పుడు కార్మికుల పక్షాన నిలబడినందుకు ఇదేనా తనకిచ్చిన బహుమానమా ? అని ప్రశ్నించారు. రంగారావు బొటనవేలు తెగిపోవడంతో వామపక్ష నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చాలాచోట్ల డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. దీంతో బస్టాండ్స్ నిర్మానుష్యంగా మారిపోయాయి.